News October 21, 2024

ఎలక్షన్స్ తర్వాత అమెరికా ‘బబుల్’ బరస్టేనా!

image

US ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు $500bns నష్టాల్లో ఉన్నాయి. లిక్విడిటీ లేదు. ఇక జాతీయ అప్పు $35trns. గోల్డ్, పెట్రోల్ లేకుండానే ప్రింట్ చేస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సమానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బాహాటంగా చెప్తున్నారు. BRICS కరెన్సీ వస్తే ఇక ఆగమాగమేనని, US బుడగ ఏ క్షణమైనా టప్‌మని పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మీ కామెంట్.

Similar News

News November 3, 2025

ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

image

ఏపీలోని కర్నూలు, తిరుపతిలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు TGలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం దంచికొట్టింది. యాదాద్రిలోని చౌటుప్పల్‌లో 6.1cm, నిజామాబాద్‌లోని మంచిప్పలో 5.4cmల వర్షపాతం నమోదైంది.

News November 3, 2025

రోజూ శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే..

image

శివలింగానికి రోజూ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అభిషేకం ఆరోగ్యంతో పాటు, బలం, యశస్సు, కీర్తిని ప్రసాదిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. ‘పెరుగు చాలా శుభప్రదమైనది. పౌష్టికపరమైనది. ఈ అభిషేకం భక్తుల శారీరక, మానసిక రోగాలను మాయం చేస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు పెరిగి, మంచి వ్యక్తిత్వంతో జీవించడానికి శివానుగ్రహం లభిస్తుంది’ అంటున్నారు.

News November 3, 2025

ఇంటర్నేషనల్ మ్యాచే ఆడలేదు.. WC నెగ్గారు

image

భారత మహిళల <<18182320>>క్రికెట్<<>> చరిత్రలో హెడ్ కోచ్ ‘అమోల్ ముజుందర్’ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారత్ WC లిఫ్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ముంబై బోర్న్ డొమెస్టిక్ స్టార్.. ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచూ ఆడలేదు. టీమ్ ఇండియాకి ప్రాతినిధ్యం వహించాలన్న తన కలను ఈ విధంగా సాకారం చేసుకున్నారు. ‘క్రెడిట్ అంతా మహిళలకే దక్కుతుంది. ఓటములతో మేము కుంగి పోలేదు. ఇవాళ మా లక్ష్యాన్ని సాధించాం’ అని ముజుందర్ తెలిపారు.