News October 21, 2024

మాల్దీవ్స్ వెళ్లే భారతీయులకు గుడ్‌న్యూస్

image

మాల్దీవ్స్‌కు వెళ్లే భారతీయులకు ప్రెసిడెంట్ ముయిజ్జు గుడ్‌న్యూస్ చెప్పారు. అక్కడ UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పేమెంట్స్ చేయడం భారతీయులకు సులభతరం కానుంది. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసె‌స్‌లో సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో మాల్దీవ్స్‌లో యూపీఐ పేమెంట్స్‌ తీసుకురావాలని ఆయన నిర్ణయించారు.

Similar News

News October 21, 2024

మీరూ ‘హాలోవీన్’ సెలబ్రేట్ చేసుకున్నారా?

image

హాలోవీన్ అంటే ఏంటో తెలుసా? సుమారు 2 వేల ఏళ్ల క్రితం బ్రిటన్, ఐర్లాండ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉండే ‘సెల్ట్స్’ జాతి ప్రజలు దీనిని స్టార్ట్ చేశారు. NOV నుంచి చలికాలం మొదలై వివిధ రకాల వ్యాధులొస్తుండేవి. దానికి ముందురోజే OCT 31న అంతా ఒక దగ్గర చేరి మంటలు వేసి విచిత్ర వేషధారణలతో అతీత శక్తులని తరిమివేయాలనే ఆలోచనతో ఈ ఆచారం మొదలుపెట్టారు. ‘ఆల్ హాలోస్ డే’గా పిలిచేదాన్ని ‘హాలోవీన్’గా మార్చారు.

News October 21, 2024

అలాంటి వారు ఇక‌ నో ఫ్లై జాబితాలో: రామ్మోహ‌న్ నాయుడు

image

విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపు సందేశాలు పంపడాన్ని నేరంగా ప‌రిగ‌ణించేలా చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ చేయనున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలిపారు. అలాగే బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డిన వారిని నో ఫ్లై జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టిదాకా 75 సంస్థ‌ల‌కు బెదిరింపులు వ‌చ్చాయి. ఈ బెదిరింపుల విషయంలో ఒకేర‌క‌మైన భాష‌ను ఉప‌యోగిస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

News October 21, 2024

నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

image

AP: ఓ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మంగళగిరి కోర్టు నవంబర్ 4 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించారు. సురేశ్ ప్రోద్బలంతోనే ఈ వివాదం జరిగిందనే బంధువుల ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.