News October 21, 2024

హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

image

ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్‌పై గతంలో కేసు నమోదైంది.

Similar News

News October 21, 2024

కాసేపట్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో గంటలో హైదరాబాద్ నగరంలోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. అలాగే భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో వానలు పడుతాయని అంచనా వేశారు. ఇప్పటికే వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.

News October 21, 2024

బీఎస్సీ(ఆనర్స్) సీట్ల సంఖ్య పెంపు

image

TG: జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ(ఆనర్స్) సీట్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరంలో అదనంగా 200 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ అవసరాలు, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రత్యేక కోటాలో ఉన్న ఈ కోర్సు ఫీజును రూ.10లక్షల నుంచి రూ.5లక్షలకు తగ్గించింది.

News October 21, 2024

‘ఇసుక’పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: సొంత అవసరాలకు ట్రాక్టర్లతో ఫ్రీగా ఇసుకను తీసుకెళ్లేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని CM చంద్రబాబు చెప్పారు. ఇసుక పాలసీని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘రీచ్‌లలో తవ్వకాలు, లోడింగ్ ప్రక్రియను ప్రైవేట్‌కు అప్పగించడంపై ఆలోచించాలి. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపు కట్టడికి చెన్నై, HYD, BLR మార్గాల్లో చెక్‌పోస్టులు పెట్టాలి’ అని అధికారులను ఆదేశించారు.