News October 21, 2024
హైకోర్టులోనే తేల్చుకోండి: SC

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.
Similar News
News January 7, 2026
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్లు కొట్టివేత

TG: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
News January 7, 2026
RARE: పర్ఫెక్ట్ ఫిబ్రవరి.. గమనించారా?

వచ్చే ఫిబ్రవరి నెలను ‘పర్ఫెక్ట్ ఫిబ్రవరి’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఆ నెల ఆదివారంతో మొదలై సరిగ్గా 28 రోజులు పూర్తి చేసుకుని శనివారంతో ముగియనుంది. అంటే ఎక్కడా మిగిలిపోకుండా కచ్చితంగా 4 వారాల కాలచక్రాన్ని కలిగి ఉండటం విశేషం. చివరిసారిగా 2015లో ఇలానే జరిగింది. క్యాలెండర్‌లో నెలంతా ఒక క్రమ పద్ధతిలో సెట్ అవ్వడంతో దీనిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మీరూ ఇది గమనించారా? COMMENT
News January 7, 2026
తెలుగులో ఛార్జ్‌షీట్.. పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం

TG: పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాల సమర్పణ అంతా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. దీంతో అటు బాధితులు, ఇటు నిందితులకు అందులోని అంశాలు అర్థం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో దుండిగల్ PSలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వరూప తెలుగులో 2 ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి పోలీస్ శాఖలో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. తాజాగా డీజీపీ శివధర్ రెడ్డి, ఐపీఎస్ శిఖా గోయల్ ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు.


