News October 21, 2024
గ్రూప్1 అభ్యర్థులకు విషెస్ చెప్పిన CM
TG: మరికాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు చెప్పారు. ఎటువంటి ఆందోళన చెందకుండా, పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. ‘ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 3, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News January 3, 2025
నేటి నుంచి నుమాయిష్
TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో 2వేల స్టాల్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్‌లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.
News January 3, 2025
మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.