News October 21, 2024
CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?

ఐపీఎల్‌లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తానని MS చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా CSKలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News January 2, 2026
ఇంద్రవెల్లి: వృద్ధురాలి వద్ద బంగారం చోరీ

ఇంద్రవెల్లి మార్కెట్‌లో ఓ వృద్ధురాలి వద్ద బంగారు చెవిపోగులు చోరీకి గురైనట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశామన్నారు. పైన ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే 8712659941 ఈ నంబర్‌కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
News January 2, 2026
‘SIR’ను త్వరగా మొదలుపెట్టండి.. జనసేన సూచన

AP: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను త్వరగా రాష్ట్రంలో ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరింది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జనసేన ప్రతినిధులు భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, బలోపేతంగా మార్చేందుకు ఈసీ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ SIR, AI వినియోగంపై ప్రతిపాదనలు చేసింది.
News January 2, 2026
మహిళల కోసం కొత్త స్కీమ్.. వివరాలివే

TG: మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం(D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా అందులో ప్రభుత్వం ₹1.40లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగతా ₹60వేలు బ్యాంకులు లోన్ ఇస్తాయి.


