News October 21, 2024

పెదపెంకిలో ఫైలేరియా సమస్య పరిష్కరిస్తాం: పవన్ కళ్యాణ్ 

image

ఉమ్మడి విజయనగరంలోని పెదపెంకి గ్రామంలో ఫైలేరియా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. గుర్ల గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆయన విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్యాధికారులతో మాట్లాడుతూ.. నియంత్రణకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

Similar News

News September 17, 2025

గంట్యాడ: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. భీమవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఈనెల 12న రాత్రి గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

image

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

News September 16, 2025

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 ల‌క్ష్యం: VZM జేసీ

image

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌ ల‌క్ష్య‌మ‌ని జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌ స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శులు బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చే విధంగా కృషి చేయాల‌ని కోరారు. పీ-4 కార్య‌క్ర‌మం, బంగారు కుటుంబాలు, మార్గ‌ద‌ర్శుల పాత్ర‌పై స‌చివాల‌యం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.