News October 21, 2024

రుషికొండ ప్యాలెస్‌‌ను పరిశీలించనున్న పవన్ కల్యాణ్

image

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో రుషికొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌ను పరిశీలించనున్నట్లు జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఈ ప్యాలెస్ నిర్మాణంపై వైసీపీ.. కూటమి పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్న విషయం తెలిసిందే.

Similar News

News November 11, 2025

‘విశాఖ వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

image

CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖ CP కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ CP గోపినాథ్ జెట్టి సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమ్మిట్ కోసం నగరానికి రానున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖల కోసం తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు.ట్రాఫిక్ జామ్‌లు కాకుండా చూడాలన్నారు.

News November 11, 2025

విశాఖలో విషాద ఘటన

image

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

News November 10, 2025

భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

image

ఈ నెల 14,15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌దస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్రసాద్ నిర్దేశించారు. క‌లెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌న్వ‌య లోపం రాకుండా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. స‌దస్సులో ఉపరాష్ట్రప‌తి, గవ‌ర్న‌ర్, సీఎం, కేంద్రమంత్రులు భాగ‌స్వామ్యం కానున్నార‌ని సూచించారు.