News October 21, 2024
Stock Market: లాభాలు నిలుపుకోలేక నష్టాల్లోకి

ఆరంభ లాభాలను మార్కెట్లు నిలుపుకోలేకపోయాయి. ఉదయం 100 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ చివరికి 72 పాయింట్లు నష్టపోయి 24,781 వద్ద స్థిరపడింది. అటు సెన్సెక్స్ 81,450 పరిధి దాటలేక 73 పాయింట్ల నష్టపోయి 81,151 వద్ద స్థిరపడింది. BSeలో 9 మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. Bajaj Auto, Hdfc Bank, Asian Paint, M&M టాప్ గెయినర్స్. Tata Consum, Kotak Bank, Bajaj Finsv, BPCL, IndusInDBK టాప్ లూజర్స్.
Similar News
News January 26, 2026
‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి?

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో ‘స్పిరిట్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌కు ఫాదర్ రోల్‌లో ఆయన కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 15 నిమిషాల పాటు కనిపించే పాత్రకు ఆయన ఓకే చెప్పారని టాక్. అయితే ఈ విషయమై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ‘స్పిరిట్’ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది.
News January 26, 2026
బ్రాకీథెరపీ.. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయుడి అద్భుతం

క్యాన్సర్ వైద్యంలో విప్లవం సృష్టించిన తెలుగు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కేంద్రం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన అభివృద్ధి చేసిన ‘హై డోస్ రేట్ బ్రాకీథెరపీ’ విధానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతోంది. ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా నేరుగా క్యాన్సర్ కణితిపైనే రేడియేషన్ వేయడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా గర్భాశయ, ఊపిరితిత్తులు, మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు ఈ చికిత్స వరంగా మారింది.
News January 26, 2026
వేసవి ఉల్లి సాగుకు సూచనలు

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్‌ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.


