News October 21, 2024

ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధం: షమీ

image

గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న పేసర్ షమీ తాను పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధంగా ఉన్నట్లు సెలెక్టర్లకు సిగ్నల్ ఇచ్చారు. ‘నేను హాఫ్ రన్‌తో బౌలింగ్ ప్రారంభించా. 100 శాతం నొప్పి లేకుండా ఉన్నా. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లకు ఎలాంటి అస్త్రాలు కావాలనే దానిపై వర్క్ చేస్తున్నా. అంతకు ముందు రంజీట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2024

ఈ సింగర్ ఆస్తి రూ.లక్ష కోట్లు!

image

సింగర్, పాటల రచయితగా సంగీత ప్రియులకు దగ్గరైన అనన్య శ్రీ బిర్లా అత్యంత ధనవంతురాలని చాలా మందికి తెలియదు. బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా పెద్ద కుమార్తెనే ఈ అనన్య బిర్లా. ఆమె 2016లో సంగీతరంగ ప్రవేశం చేసి అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. 28 ఏళ్ల వయసులోనే ఆమె ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) డైరెక్టర్‌‌గా పనిచేస్తున్నారు. ఆమె నెట్‌వర్త్ $13 బిలియన్లు (రూ.లక్ష కోట్ల పైనే).

News October 22, 2024

మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షనీయం: పవన్

image

AP: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన జాతీయ జెండాను రూపొందించి జాతికి అందించారని కొనియాడారు.

News October 22, 2024

బీటెక్ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం

image

TG: నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపునకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లు కావాలని ఆయా కాలేజీలు JNTUని కోరాయి. అందుకు జేఎన్‌టీయూ అంగీకరించకపోవడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన హైకోర్టు నాలుగు కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయనుంది.