News October 21, 2024

BIG BREAKING: పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు HYD సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణ CSకు కూడా నోటీసులిచ్చింది. తిరుమల లడ్డూ విషయంలో పవన్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని ఓ న్యాయవాది ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్యకు పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యిని వాడినట్లు మాట్లాడారని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరారు.

Similar News

News October 22, 2024

మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పెట్టడం హర్షనీయం: పవన్

image

AP: మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. కళాశాలకు ఆ మహనీయుడి పేరు పెట్టడం ద్వారా ఆయన ఇచ్చిన స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందుతుందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఆయన జాతీయ జెండాను రూపొందించి జాతికి అందించారని కొనియాడారు.

News October 22, 2024

బీటెక్ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం

image

TG: నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపునకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లు కావాలని ఆయా కాలేజీలు JNTUని కోరాయి. అందుకు జేఎన్‌టీయూ అంగీకరించకపోవడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన హైకోర్టు నాలుగు కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయనుంది.

News October 22, 2024

బెంగాల్‌లో దీక్ష విరమించిన జూనియర్ డాక్టర్లు

image

బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష ముగిసింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన తమ సహచరురాలికి న్యాయం చేయాలంటూ 16 రోజులుగా వారు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. వైద్యులపై దాడి, వైద్యులకు రక్షణ, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వంటి అంశాలపై మమతా వారికి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలను జూడాలు విరమించారు.