News October 21, 2024
రుషికొండ ప్యాలెస్‌లో పవన్ కళ్యాణ్

విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. స్థానిక ఎంపీ భరత్‌తో పాటు ఎమ్మెల్యేలతో కలిసి భవన సముదాయాల్లో కలియతిరిగారు. కొండ పైనుంచి బీచ్ అందాలను చూస్తూ ఫొటోలు తీసుకున్నారు. ప్యాలెస్ వద్ద పనిచేస్తోన్న కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన ట్విటర్‌లో షేర్ చేసింది.
Similar News
News January 13, 2026
మరో 4 సహకార బ్యాంకులు : CEO శ్రీనివాసరావు

కేంద్ర కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మరో 4 సహకార బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయని సొసైటీ CEO శ్రీనివాసరావు Way2Newsతో తెలిపారు. ఇప్పటికే 23 ఉండగా నూతనంగా 4 బ్యాంకులను ఇందుకూరుపేట, నెల్లూరు(R)లో కాకుపల్లి, కొత్తూరు, డక్కిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తామని వెల్లడించారు. తమ బ్యాంకు పరిధిలో ఈ ఏడాది రూ.2900 కోట్ల వ్యాపార లక్ష్యానికి రూ.2250 కోట్లకు చేరువయ్యామని తెలిపారు.
News January 13, 2026
చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో కన్ను కోల్పోయిన చిన్నారి!

చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ పేలడంతో ఓ చిన్నారి చూపు కోల్పోయాడు. ఒడిశాలోని టిట్లాగఢ్‌లో అంకేశ్(8) చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన టాయ్‌తో ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్లాడు. ఆ బొమ్మ స్టవ్‌పై పడి పేలిపోయింది. దీంతో అతడి కంటికి తీవ్ర గాయమై చూపు కోల్పోయాడు. గతనెలలో కంధమల్(D)లో చిప్స్ ప్యాకెట్‌లోని టాయ్ మింగి 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడు. ఇలాంటి టాయ్స్ విషయంలో పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 13, 2026
IT కంపెనీల లాభాలకు గండి.. కారణమిదే

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల IT కంపెనీల లాభాలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా వేతనంలో బేసిక్ పే 50% ఉండాలనే నిబంధన.. దీనివల్ల PF, గ్రాట్యుటీ ఖర్చులు పెరగడం సంస్థలకు భారంగా మారింది. అలాగే ఏడాదికే గ్రాట్యుటీ చెల్లింపు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కోసం కంపెనీలు భారీగా నిధులను కేటాయించాల్సి వచ్చింది. ఈ అదనపు వ్యయాలే TCS, HCL వంటి కంపెనీల నికర లాభాలను తగ్గించాయి. అయితే ఇది ఈ క్వార్టర్‌కే పరిమితమని నిపుణులు తెలిపారు.


