News October 21, 2024
48 రన్స్ చేసిన చాహల్.. క్రికెటర్ల ఆశ్చర్యం

రంజీ ట్రోఫీలో భారత బౌలర్ చాహల్ 48 రన్స్ చేయడంపై పలువురు క్రికెటర్లు ఆశ్చర్యపోతున్నారు. హరియాణా తరఫున పదో స్థానంలో వచ్చిన చాహల్.. యూపీపై 152 బంతులాడి 2 రన్స్ తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ‘వాహ్ ఉస్తాద్.. సూపర్ బ్యాటింగ్’ అని రైనా ప్రశంసలు కురిపించారు. ‘ఎన్ని రన్స్ చేశావ్?’ అని బట్లర్ అడగ్గా.. ’48 రన్స్ కొట్టా. నాతో కలిసి ఓపెనింగ్ చెయ్ జోష్ భాయ్’ అని చాహల్ నవ్వులు పూయించారు.
Similar News
News March 15, 2025
ఆస్ట్రేలియాలో BGT ఆడే అవకాశాలు తక్కువే: కోహ్లీ

రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టేస్తానని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలిపారు. ప్రస్తుతం రిటైరయ్యే ఆలోచన లేదన్నారు. కానీ మరోసారి ఆస్ట్రేలియాలో బీజీటీ ఆడే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. కాగా 2027-28లో ఆస్ట్రేలియాలో బీజీటీ జరగనుంది. ఆలోగా విరాట్ టెస్టులకు రిటైర్మెంట్ పలికే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టీ20లకు స్వస్తి పలికిన విషయం తెలిసిందే.
News March 15, 2025
ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.
News March 15, 2025
జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

AP: వైసీపీ రాక్షస మూకల దాడిలో మృతిచెందిన చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయపడిన రామకృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హత్యా రాజకీయాలు మానడం లేదని మండిపడ్డారు. YCP రక్తచరిత్రకు TDP సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.