News October 21, 2024
సింగరేణిలో 2349 మంది బదిలీ వర్కర్లకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 2349 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూరులుగా క్రమబద్ధీకరిస్తూ సింగరేణి యాజమాన్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థ సీఎండీ బలరాం ఆదేశాలు జారీ చేశారు. సంస్థలో చేరినప్పటి నుంచి సంవత్సరంలో 240 మాస్టర్లకు గాను 190 రోజులు విధులు నిర్వహించిన వారిని రెగ్యులరైజ్ చేశారు. 2024 సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూరులుగా గుర్తించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News January 19, 2026
హుస్నాబాద్: అదుపుతప్పిన బైక్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్(27) బైక్ అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొని మృతిచెందాడు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన మనోహర్ హుస్నాబాద్-కరీంనగర్ మార్గంలో సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. 108 సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
News January 18, 2026
కరీంనగర్ జిల్లాలో వార్డుల రిజర్వేషన్లు పూర్తి

KNR జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ సహా జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి లాటరీ పద్ధతిన ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 17, 2026
కరీంనగర్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

KNR కార్పొరేషన్ 66 వార్డుల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ జనరల్: 28
ఎస్సీ మహిళ: 27, 30, 53
ఎస్సీ జనరల్: 4, 20, 25, 29
బీసీ మహిళ: 1, 5, 17, 33, 35, 43, 45, 47, 48, 54, 62, 64
బీసీ జనరల్: 10, 14, 31, 32, 34, 36, 37, 39, 46, 58, 59, 61, 63
జనరల్ మహిళ: 3, 7, 9, 11, 12, 13, 15,19, 38, 40, 41, 44, 49, 52, 55, 56, 57, 60
జనరల్: 2, 6, 8, 16, 18, 21, 22, 23, 24, 26, 42, 50, 51, 65, 66


