News October 21, 2024
ఆ విషపూరిత నురుగు అంతరిక్షం నుంచీ కనిపిస్తోంది

ఢిల్లీకి ప్రధాన నీటి వనరైన యమునా నది కలుషిత స్థాయులను చెప్పేందుకు ఈ ఒక్క చిత్రం సరిపోతుందేమో. ఏటా నవంబర్‌లో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం సహా పండుగల సీజన్లో నగరంలో గాలి, నీటి కాలుష్యం భారీగా పెరుగుతుంది. పరిశ్రమల రసాయనాలు, కాలువల వ్యర్థాలతో నది ప్రధాన బ్యారేజ్‌ల వద్ద విషపూరిత నురుగు దర్శనమిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా అది కనిపిస్తుండడం గమనార్హం.
Similar News
News January 12, 2026
ఈకల రంగును బట్టి కోళ్ల జాతిని గుర్తిస్తారు

ఈకల రంగుని బట్టి కోడిపుంజు రకాలను, జాతులను గుర్తిస్తారు. నల్ల ఈకలుంటే “కాకి”, తెల్లని ఈకలుంటే “సేతు” అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే “పర్ల”, ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే ‘డేగ’ అని, రెక్కల పై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే దానిని “నెమలి” అని పిలుస్తారు. ఇంకా మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని “కౌజు” అని, ఈకలు లేత బంగారు రంగులో ఉంటే ‘అబ్రాసు’ అంటారు.
News January 12, 2026
నెలాఖరులోగా SLBC పనులు ప్రారంభించాలి: మంత్రి ఉత్తమ్

TG: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగ పనులను ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించాలని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. <<18806199>>టన్నెల్ బోరింగ్ మెషీన్<<>>ను తొలగించిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో (DBM) పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల్లో కొంత మొత్తాన్ని వారం రోజుల్లోగా చెల్లిస్తామని నిర్మాణ సంస్థకు హామీ ఇచ్చారు.
News January 12, 2026
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 132 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


