News October 21, 2024

₹1,000 కోట్ల‌కు స‌గం వాటా అమ్మేసిన క‌ర‌ణ్‌ జోహార్‌

image

బాలీవుడ్‌లో భారీ డీల్ కుదిరింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా క‌లిగిన క‌ర‌ణ్ సంస్థను న‌డిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్ష‌న్స్ హౌస్‌లో భాగ‌స్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌ను ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చుతామని క‌ర‌ణ్ పేర్కొన్నారు.

Similar News

News October 22, 2024

రాష్ట్రంలో కొత్త వ్యవసాయ కాలేజీలు

image

TG: ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా అగ్రికల్చర్ కాలేజీలను ప్రారంభించాలని వ్యవసాయ శాఖ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కాలేజీల ఏర్పాటుకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలోనూ అగ్రికల్చర్ కోర్సులు ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ కోరింది.

News October 22, 2024

12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్

image

TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్‌లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్‌ఫర్స్‌లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

News October 22, 2024

టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు

image

AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.