News October 22, 2024

ఆస్ట్రేలియా టూర్‌కు ఇండియా-A టీమ్ ఇదే

image

ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. రుతురాజ్ కెప్టెన్సీలోని ఈ జట్టు AUS-Aతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు, భారత జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ (NOV 15-17) ఆడనుంది.
>> జట్టు: రుతురాజ్ గైక్వాడ్(C), అభిమన్యు ఈశ్వరన్, సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, పోరెల్, ముకేశ్, ఖలీల్, యశ్ దయాల్, సైనీ, మనవ్, తనుశ్.

Similar News

News February 7, 2026

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు ట్రంప్ డెడ్‌లైన్

image

రష్యాతో తమ యుద్ధాన్ని జూన్ నాటికి ముగించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డెడ్‌లైన్ విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. అందుకోసం వచ్చేవారం మరో దఫా చర్చలు జరిపేందుకు ఇరు పక్షాలనూ USకు ఆహ్వానించినట్లు చెప్పారు. దానికి తాను సమ్మతించినట్లు వెల్లడించారు. రష్యా స్టాండ్ ఏంటనేది మాత్రం తెలియదన్నారు. అబుదాబీలో ఇటీవల ముగిసిన చర్చల్లో కొన్ని కీలక అంశాలపై సయోధ్య కుదరలేదని వెల్లడించారు.

News February 7, 2026

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న USA

image

T20WC: వాంఖడే వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో అమెరికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా ఈ మ్యాచుకు దూరమైనట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, రింకూ, సూర్య(C), హార్దిక్, దూబే, అక్షర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, సిరాజ్.

News February 7, 2026

మంత్రాలు చదవాలా, ఉచ్ఛరించాలా?

image

బుద్ధిని పెంచుకోవడానికి ‘గ్రంథాలు’ చదవాలి. ఏకాగ్రత, ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపడానికి స్తోత్రాలు ‘పఠించాలి’. అనుకున్న ఫలితం సిద్ధించాలంటే అక్షర దోషం లేకుండా మంత్రాన్ని ‘ఉచ్ఛరించాలి’. దేవునితో అనుబంధాన్ని, శరణాగతిని పొందాలంటే ఆయన గుణాలను ‘స్తుతించాలి’. ఎలాంటి ఆడంబరాలు లేకుండా ప్రేమతోనే ఆయన నామాన్ని ‘పలకాలి’. తద్వారా దైవ సాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చు. ఇవన్నీ కలిస్తేనే పరిపూర్ణమైన భక్తి సాధ్యం.