News October 22, 2024
విజయవాడ విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా నేడు సోమవారం 48 విమాన సర్వీసులు ప్రయాణించాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 24 సర్వీసుల ద్వారా 2094 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2211 మంది 24 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా విమాన సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామని పేర్కొంది.
Similar News
News November 23, 2024
మండవల్లి: తల్లి-కుమారుడు దారుణ హత్య
మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో అర్ధరాత్రి తల్లి-కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు రొయ్యూరు భ్రమరాంబ (60), సురేశ్ (21)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఇంటిలో వీరు హత్యకు గురి కావడం గ్రామంలో సంచలనంగా మారింది. ఆస్తి కోసమే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మండవల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 23, 2024
పెనమలూరు: ‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు’
పెనమలూరులోని పోరంకి కుమ్మరి బజార్‌కు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా వేరుగా పాపతో కుట్టుమిషన్‌తో జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ మహిళ బట్టలు కుట్టించుకొని భర్త సుందర్ సెల్ నుంచి డబ్బులు పంపేది. సుందర్ మహిళకు ఫోన్ చేసి మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకునేవాడు. గతంలో అబార్షన్ కూడా చేయించాడు. అంతే కాకుండా తన డబ్బులు, బంగారం తీసుకుని మోసం చేశాడని పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది.
News November 23, 2024
విజయవాడలో విషాద ఘటన.. తల్లీ, బిడ్డ మృతి
విజయవాడలో శుక్రవారం విషాద ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. పి.సమ్మక్క భర్తతో విడిపోయి కొడుకుతో దుర్గా ఘాట్‌లో స్వీపర్‌గా పనిచేస్తుంది. ఈక్రమంలో నాగరాజు పరిచయమై పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సమ్మక్క 8నెలల గర్భణీ. ఈనెల 19న నాగరాజు పనికెళ్లాడు. చుట్టుపక్కల వారు నాగరాజుకు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని చెప్పగా, వెళ్లి చూడగా రక్తపు మడుగులో మగ శిశువుకు జన్మనిచ్చి బిడ్డతో సహా మృతి చెంది ఉంది.