News October 22, 2024

దేశవ్యాప్తంగా 2 కోట్ల మందికి నూతనంగా ఇళ్లు: పెమ్మసాని

image

AP: PM ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులకు ఎంపిక చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గృహ నిర్మాణ రంగం కుంటుపడిందని మంత్రి పార్థసారధి విమర్శించారు.

Similar News

News March 16, 2025

IPL: ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్

image

మరో వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో 23న SRHతో మ్యాచుకు ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.

News March 16, 2025

కమెడియన్లతో నటించేందుకు ఇష్టపడరు: సప్తగిరి

image

కమెడియన్లతో నటించేందుకు హీరోయిన్లు ఇష్టపడరని నటుడు సప్తగిరి అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం కష్టం. చాలా మంది కమెడియన్ పక్కనా? అంటారు. తన పక్కన నటించడానికి ఒప్పుకున్న ప్రియాంక శర్మకు ధన్యవాదాలు’ అని తెలిపారు. అలాగే, సినిమా వాళ్లకు ఎంత పేరొచ్చినా, మంచి అలవాట్లు ఉన్నా పిల్లను ఇవ్వరని తెలిపారు.

News March 16, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 16, ఆదివారం ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు ఇష: రాత్రి 7.38 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!