News October 22, 2024

బెంగాల్‌లో దీక్ష విరమించిన జూనియర్ డాక్టర్లు

image

బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష ముగిసింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన తమ సహచరురాలికి న్యాయం చేయాలంటూ 16 రోజులుగా వారు దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో సీఎం మమతా బెనర్జీ చర్చలు జరిపారు. వైద్యులపై దాడి, వైద్యులకు రక్షణ, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు వంటి అంశాలపై మమతా వారికి హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలను జూడాలు విరమించారు.

Similar News

News October 22, 2024

సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ షురూ

image

ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 28.22 లక్షల ఆయకట్టును పర్యవేక్షించేందుకు గాను 6,149 సాగునీటి సంఘాలకు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వారు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. NOV 20న నోటిఫికేషన్ జారీ చేసి 27 నాటికి ప్రక్రియ ముగిస్తారు.

News October 22, 2024

CM కాన్వాయ్‌.. సామాన్యులు ఆగనక్కర్లేదు!

image

TG: గతంలో CM కాన్వాయ్ వచ్చే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించేవారు కాదు. అయితే CM రేవంత్ ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో ఆయన పలు మార్పులను పోలీసులకు సూచించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ఇతర వాహనాలను ఆపొద్దని చెప్పారు. దీంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో వీలైనంతవరకు వాహనాలను అనుమతిస్తున్నారు. డివైడర్‌కు అవతలివైపున్న వాహనాలనూ పంపిస్తున్నారు.

News October 22, 2024

అడవి బిడ్డల ఉద్యమ గర్జన ‘కొమురం భీం’

image

జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడిన గోండు బెబ్బులి కొమురం భీం జయంతి నేడు. ఆసిఫాబాద్(D)లోని ఆదివాసీలను పీడిస్తున్న నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. గెరిల్లా తరహా పోరాటాలకు ఆదివాసీలను సిద్ధం చేసి నిజాంకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. అయితే సైన్యం తూటాలకు భీం నేలకొరిగాడు. కానీ ఆయన రగిల్చిన పోరాటం ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. అడవి బిడ్డలకు ప్రత్యేక హక్కులు కల్పించింది.