News October 22, 2024
జేసీ దివాకర్ రెడ్డిపై సినిమా?

ఏపీ రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఇంటికే పరిమితం కాగా ఆయనపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘జూటూరు రాజు’ టైటిల్‌తో ఓ డైరెక్టర్ జేసీ ఫ్యామిలీతో చర్చలు జరుపుతున్నారట. నటుడు రాజేంద్రప్రసాద్ దివాకర్ రెడ్డి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
Similar News
News November 3, 2025
పోలీస్ పీజీఆర్ఎస్కు 105 పిటిషన్లు: ఎస్పీ

అనంతపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 105 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పిర్యాదు దారులతో ఆయన నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
తరచూ బాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయాలి: జేసీ

జిల్లాలో ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణా కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జేసీ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫారసు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల సంరక్షణా కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.


