News October 22, 2024

సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ షురూ

image

ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 28.22 లక్షల ఆయకట్టును పర్యవేక్షించేందుకు గాను 6,149 సాగునీటి సంఘాలకు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వారు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. NOV 20న నోటిఫికేషన్ జారీ చేసి 27 నాటికి ప్రక్రియ ముగిస్తారు.

Similar News

News October 22, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, రేపటికి తుఫాన్‌గా మారనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ గురువారం తీవ్ర తుఫాన్‌గా బలపడుతుంది, ఆ తర్వాత ఒడిశాలోని పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

News October 22, 2024

షా, ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో సంచలనం!

image

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముంబైలో అమిత్ షా సమక్షంలో DY CM దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన UBT నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ కలిశారన్న వార్తలు సంచలనంగా మారాయి. వీరు మహాయుతిలో చేరతారేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. ఈ భేటీ వార్తలను రౌత్ కొట్టిపారేసినా ఎక్కువ సీట్లను రాబట్టేలా MVAను బెదిరించేందుకు SS UBT ఇలాంటి ఫీలర్లు వదులుతోందన్న విమర్శలూ వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్.

News October 22, 2024

హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్షసాయి

image

యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. లైంగిక ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు హర్షసాయి తనను లైంగికంగా వేధించారని నటి మిత్రా శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.