News October 22, 2024

అర్జీలు రీ ఓపెన్ కాకూడదు: కలెక్టర్

image

గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీలు రీ ఓపెన్ కాకుండా వెంటనే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వినతులను స్వీకరించారు. 36 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, అర్జీలు రీ ఓపెన్ కాకుండా ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులు 30 పెండింగ్ ఉన్నాయని చెప్పారు.

Similar News

News January 3, 2025

టమాటా రైతులకు కాస్త ఊరట

image

పత్తికొండ టమాటా మార్కెట్‌లో టమాటా ధరలు కొంత మేర పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకు 25కిలోల బాక్సు కేవలం రూ.30కి మాత్రమే అమ్ముడయ్యాయి. కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా నిన్న కొంత మేర ధర పెరగడంతో ఊరట చెందారు. కిలో గరిష్ఠంగా రూ.18 పలికింది. సరాసరి రూ.15, కనిష్ఠ ధర రూ.10తో క్రయ విక్రయాలు సాగాయి. నిన్న మార్కెట్‌కు 180 క్వింటాళ్ల టమాటా వచ్చింది.

News January 3, 2025

డాక్టర్లూ మీరు గ్రేట్ ❤

image

కర్నూలు జిల్లా వెల్దుర్తి మం. కలుగొట్ల గ్రామ ప్రజలకు ఆ ఊరికి చెందిన నలుగురు డాక్టర్లు ఉచిత వైద్యం అందిస్తున్నారు. చంద్రశేఖర్, జాన్ పాల్, మద్దమ్మ, కృష్ణ అనే వైద్యులు గురువారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్, బీపీ, తదితర టెస్టులు చేసి ఫ్రీగా మందులు అందించారు. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సొంత ఖర్చుతో వైద్య శిబిరం నిర్వహించామని వారు తెలిపారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News January 3, 2025

కర్నూలు జిల్లాకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలు.!

image

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని నదులన్నింటినీ గోదావరి నుంచి బాణాకచర్లకు అనుసంధానిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.