News October 22, 2024
పైడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సిరిమాను ఘట్టం పురస్కరించుకొని తరువాత మంగళవారం కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భారీ క్యూ లైన్లు ఏర్పడంతో చిన్నపిల్లలతో వస్తున్న వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం పెద్ద చెరువులో తెప్పోత్సవానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News January 16, 2026
గుర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

గుర్ల పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు . పండగ సందర్భంగా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి క్షేమంగా గమ్యస్థానం చేరే విధంగా చూడాలని ఎస్సై నారాయణరావుకు సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు.
News January 16, 2026
విజయనగరంలో కేజీ చికెన్ రూ.240

నేడు కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. కాగా నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ (స్కిన్) రూ.260, స్కిన్ లెస్ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
News January 16, 2026
సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.


