News October 22, 2024
విశాఖ: మిగుల సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఐటిఐల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ ఒక ప్రకటన తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 26 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 28న ప్రభుత్వ ఐటీఐలకు, 30న ప్రైవేటు ఐటీఐలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కళాశాలలో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు.
Similar News
News July 7, 2025
విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.
News July 7, 2025
విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.
News July 6, 2025
విశాఖలో భక్తి శ్రద్ధలతో మొహరం

విశాఖలో మొహరం వేడుకలకు ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చెంగలరావుపేటలోని హుసేని మసీదు ఆధ్వర్యంలో షియా ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ మరణానికి సానుభూతిగా రక్తం చిందించారు. ఈ కార్యక్రమంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.