News October 22, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి, రేపటికి తుఫాన్‌గా మారనుంది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ గురువారం తీవ్ర తుఫాన్‌గా బలపడుతుంది, ఆ తర్వాత ఒడిశాలోని పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

Similar News

News October 22, 2024

టారిఫ్ రేట్లు పెంచే అవకాశమే లేదు: BSNL CMD

image

ప్రైవేట్ టెలికం సంస్థల కంటే తక్కువ ధరకే టారిఫ్‌లను అందిస్తున్న BSNL మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశమే లేదని సంస్థ CMD రాబర్ట్ రవి వెల్లడించారు. వినియోగదారుల విశ్వాసం పొందడం, వారిని సంతోషంగా ఉంచడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే 4G సేవలను ప్రారంభించామని, ఈ డిసెంబర్ లోపు దేశవ్యాప్తంగా వాటిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు.

News October 22, 2024

లద్దాక్ విషయంలో భారత్‌తో ఒప్పందానికి వచ్చాం: చైనా

image

తూర్పు లద్దాక్ సరిహద్దు వివాదానికి ముగింపు పలికేలా భారత్‌తో ఒప్పందానికి వచ్చినట్లు చైనా ప్రకటించింది. ‘సరిహద్దు సమస్యలకు సంబంధించి దౌత్య, సైనికపరమైన విధానాల్లో భారత్‌తో చర్చించాం. తాజాగా ఇరు పక్షాలు ఓ పరిష్కారానికి వచ్చాయి’ అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు. గడచిన నాలుగేళ్లుగా తూర్పు లద్దాక్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

News October 22, 2024

అదనపు కలెక్టర్‌కు రూ.5కోట్ల అక్రమ ఆస్తులు.. కేసు నమోదు

image

TG: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా, రూ.5కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆయన రూ.8లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.