News October 22, 2024
మూసీ కాంట్రాక్టు పొంగులేటికేనా?

TG: ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం కాంట్రాక్టును మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అందుకే కొరియాలో పర్యటిస్తున్న బృందంలో పొంగులేటి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.
Similar News
News March 16, 2025
నేడు అమరజీవి జయంతి

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
News March 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ రేట్లు కాస్త పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ గత వారం రూ.160-180గా ఉండగా ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.160గా ఉంది. అటు ఏపీలోని కర్నూలులో రూ.180, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, పిఠాపురంలో రూ.220కి విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 16, 2025
ఒక్క హిట్ కోసం ఈ హీరోల ఎదురుచూపులు!

టాలీవుడ్‌లో ఇటు చిన్న కథలు, అటు భారీ సినిమాలు చక్కటి విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. కానీ మిడ్‌రేంజ్ హీరోలు మాత్రం ఆ మధ్యలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. విజయ్ దేవరకొండ, గోపీచంద్, నితిన్, వరుణ్ తేజ్, అక్కినేని అఖిల్.. వీళ్లంతా హిట్ చూసి చాలాకాలమే అయింది. అటు మరీ చిన్న సినిమాలు చేయలేక, ఇటు భారీ బడ్జెట్ ఎంచుకోలేక సతమతమవుతున్నారు. ఎలాగైనా హిట్ కొట్టి ట్రాక్ ఎక్కాలని ఎదురుచూస్తున్నారు.