News October 22, 2024

ఆధార్ ఉన్న వారికి శుభవార్త

image

APలో ఇవాళ్టి నుంచి ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.

Similar News

News October 22, 2024

కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి ఆ క్రీడలు తొలగింపు

image

స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2026 నుంచి క్రికెట్, హాకీ, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలను నిర్వాహకులు తొలగించారు. ఖర్చును తగ్గించుకునేందుకు కేవలం 10 క్రీడలతో నిర్వహిస్తామని ప్రకటించారు. గతంలో ఈ స్పోర్ట్స్‌లోనే భారత్ ఎక్కువ మెడల్స్ సాధించింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం భారత్‌కు ప్రతికూలంగా మారింది. 2022లో 19 క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి.

News October 22, 2024

Stock Market: భారీ నష్టాలు

image

త్రైమాసిక ఫ‌లితాల్లో కీల‌క సంస్థ‌ల వీక్ ఎర్నింగ్స్‌, FIIల అమ్మ‌కాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు న‌ష్ట‌పోయి 80,220 వ‌ద్ద‌, నిఫ్టీ 309 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,472 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. నిఫ్టీలో 47 స్టాక్స్ న‌ష్టపోయాయి. BSEలో ICICI, Infy మిన‌హా మిగిలిన 28 స్టాక్స్ రెడ్‌లో ముగిశాయి. నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

News October 22, 2024

హిమాలయాల్లోని కొత్త పాములకు హీరో పేరు!

image

పశ్చిమ హిమాలయాల్లో IND, GER, UKకు చెందిన పరిశోధకుల టీమ్ కొత్త పాముల జాతిని కనుగొంది. దీనికి నటుడు లియోనార్డో డికాప్రియో పేరును పెట్టింది. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషికిగాను ఆయన్ను ఇలా గౌరవించింది. ‘అంగ్యుక్యులస్ డికాప్రియో/డికాప్రియోస్ హిమాలయన్ స్నేక్’గా పిలిచే ఈ పాముల్ని 2020లో గుర్తించగా, తాజాగా సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో పబ్లిష్ చేశారు. ఇవి బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. 22 ఇంచుల పొడవు పెరుగుతాయి.