News October 22, 2024

వరంగల్: సీఐ బాలాజీ వరప్రసాద్‌కి అతి ఉత్కృష్ట సేవా పథకం

image

ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు పోలీసు శాఖలో ఇచ్చే అతి ఉత్కృష్ట సేవా పతకం వరంగల్ సీసీఎస్ సీఐకి లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన 2002లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం సీఐ బాలాజీ వరప్రసాద్‌కి అతి ఉత్కృష్ట సేవా పథకం లభించింది. తాజాగా అతి ఉత్కృష్ట అవార్డుకు ఎంపిక కావడంతో పలువురు పోలీస్ అధికారులు వారి మిత్రులు అభినందించారు.

Similar News

News January 21, 2026

WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

News January 21, 2026

వరంగల్‌: ‘స్కాలర్‌షిప్‌ విద్యార్థులు ఆధార్‌ లింకు చేసుకోవాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.

News January 21, 2026

గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.