News October 22, 2024

ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు

image

TG: ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు పర్యవేక్షించిన గ్రూప్ క్వాంటెలాను ప్రభుత్వం పక్కన పెట్టింది. తక్కువ వ్యయంతో నిర్వహణకు ముందుకు రావడంతో ఎన్ఐసీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. NIC మూడేళ్ల పాటు నిర్వహణ చూడనుంది.

Similar News

News October 22, 2024

ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!

image

గుజరాత్‌లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్‌లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.

News October 22, 2024

గంగవ్వకు గుండెపోటు వచ్చిందా?

image

మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు బిగ్‌బాస్ హౌజ్‌లో గుండెపోటు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ‘మై విలేజ్ షో’ టీం సభ్యుడు అంజిమామ స్పష్టతనిచ్చారు. తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారన్నారు. గతంలోనూ గంగవ్వకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని తెలిపారు. బిగ్‌బాస్ సీజన్-4లో గంగవ్వ పాల్గొనగా, తాజాగా మరోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News October 22, 2024

రెండో టెస్టుకు ముందు భారత్‌కు గుడ్ న్యూస్!

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు ముందు భారత జట్టు అసిస్టెంట్ కోచ్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన గిల్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మరోవైపు పంత్ కూడా ఫిట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా గిల్ స్థానంలో వచ్చిన సర్ఫరాజ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో విఫలమైన రాహుల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి.