News October 22, 2024

నల్గొండ: ఆ గ్రామంలో మద్యం నిషేదించాలని తీర్మానం

image

బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండా గ్రామ ప్రజలు గ్రామంలో మద్యం నిషేధిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం నిర్వహించిన గ్రామసభలో ప్రజలు, బెల్ట్ షాపుల యజమానులు మాట్లాడుకొని గ్రామంలో సంపూర్ణ మద్యపానం నిషేధానికి తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా మద్యం అమ్మితే రూ.25 వేల జరిమానాతో పాటు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని తీర్మానించుకున్నట్లు తెలిపారు.

Similar News

News January 2, 2026

నల్గొండ జిల్లాను కప్పేసిన మంచు దుప్పటి

image

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉండడంతో ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడం.. వాతావరణం చల్లగా ఉండడంతో అటు ప్రజలు.. ఇటు స్కూల్ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

News January 2, 2026

NLG: అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి

image

రిజర్వేషన్లు-నామినేషన్లకు మధ్యలో సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల జాబితా రూపొందించే పనిలో పడ్డాయి

News January 1, 2026

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.