News October 22, 2024

ఇసుక ఉచితమే.. విపక్షాల ఆరోపణలు నమ్మొద్దు: పార్థసారథి

image

AP: ఇసుక పూర్తిగా ఉచితమని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రతిపక్షం చేసే ఆరోపణలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. సొంత వాహనాల్లో ఫ్రీగా ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. తవ్వకాల ఖర్చును మాత్రం చెల్లించాలన్నారు. ఉచిత ఇసుకను దారిమళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News October 22, 2024

మహారాష్ట్రలో విపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాటు?

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి విప‌క్ష మ‌హావికాస్ అఘాడీ కూట‌మి పార్టీలు సీట్ల స‌ర్దుబాటులో ఏకాభిప్రాయానికి వ‌చ్చినట్టు తెలుస్తోంది. ప్ర‌తిపాదిత ఒప్పందం మేర‌కు 288 స్థానాల్లో కాంగ్రెస్ 105-110 స్థానాల్లో, శివ‌సేన UBT 90-95 స్థానాల్లో, NCP SP 75-80 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింప‌నున్నాయి. కాంగ్రెస్-ఉద్ధవ్ మధ్య లుకలుకలు నడుస్తున్నాయన్న వార్తల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం గమనార్హం.

News October 22, 2024

కొత్త పీఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలి: ఉద్యోగుల జేఏసీ

image

TG: కొత్త పీఆర్‌సీ సిఫార్సులు అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 28న సీఎం, సీఎస్‌కు, నవంబర్ 2న కలెక్టర్లు, 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు కార్యాచరణ లేఖలు ఇవ్వనుంది. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు, వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, JAN 23న బైక్ ర్యాలీలు, 30న మానవహారాలు నిర్వహించనుంది.

News October 22, 2024

టెస్టుల్లో మళ్లీ ఆడేందుకు సిద్ధం: డేవిడ్ వార్నర్

image

టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్‌లో ఆడతానని పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తుండగా, BGTకి ఆ స్థానం నుంచి తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.