News October 22, 2024
TU అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: CM రేవంత్ రెడ్డి
డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన యాదగిరిరావు నేడు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలన్నింటినీ సీఎం పరిష్కరిస్తారని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని వైస్ ఛాన్సలర్‌కు సీఎం సూచించారు.
Similar News
News February 3, 2025
NZB:100 మీటర్స్ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి 100 మీటర్ల హార్డిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా 40 ఏళ్ల పై కేటగిరిలో పల్లవి గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణకు చెందిన శివ లీల సిల్వర్ మెడల్, జయలక్ష్మి బ్రాంజ్ మెడల్ సాధించారు.
News February 3, 2025
NZB: విద్యుత్ దీపాల అలంకరణలో నీల కంఠేశ్వరాలయం
సుమారు 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన నిజామాబాద్‌లోని నీల కంఠేశ్వరాలయం బ్రహోత్సవాలకు సన్నద్ధమైంది. సోమవారం శివాభిషేకాలు, మంగళవారం రథ సప్తమి వేడుకల్లో భాగంగా రథ శోభ యాత్ర, బుధవారం స్వామి వారి పుష్కరిణిలో చక్రస్నానం తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని అలయ ఈవో రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
News February 3, 2025
NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా
నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్‌లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.