News October 22, 2024
‘మూసీ ప్రక్షాళన చేస్తే నల్గొండ ప్రజలకు మేలు’
మూసీ ప్రక్షాళన చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవన కోసం ప్రజాప్రతినిధులతో కలిసి సన్నాహక సమావేశ నిర్వహించి మాట్లాడారు. ప్రతి మండలంలో మూసీ ప్రక్షాళనపై ప్రజలకు కాంగ్రెస్ నేతలు తెలియపరచాలని, మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు.
Similar News
News November 22, 2024
నల్గొండ నుంచి మంత్రి పదవి ఎవరికో..?
డిసెంబర్ 7లోపు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవీ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య ఉన్నట్లు తెలుస్తొంది. కాగా ఇప్పటికే NLG నుంచి క్యాబినేట్లో ఉత్తమ్, కోమటిరెడ్డి ఉన్నారు.
News November 22, 2024
NLG: ర్యాగింగ్‌కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు: కలెక్టర్
విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన ర్యాగింగ్ వ్యతిరేక జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో జరిగిన ర్యాగింగ్ సంఘటన బాధాకరమని అన్నారు. ఇకపై ఇలాంటివి జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News November 22, 2024
NLG: మధ్యాహ్న భోజన పంపిణీపై కలెక్టర్ జూమ్ మీటింగ్
జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పంపిణీ విషయంలో జిల్లాలోని MEOలు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ ద్వారా తగు సూచనలు చేశారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణంలో తాజా కూరగాయలు, నాణ్యమైన వంట దినుసులతో శుభ్రం చేసిన వంట పాత్రలలో వండాలన్నారు. వండిన భోజనాన్ని ముందుగా హెచ్ఎం, మధ్యాహ్న భోజన ఇంచార్జీ రుచి చూసిన తరువాత మాత్రమే విద్యార్థులకు అందజేయాలని అన్నారు.