News October 22, 2024

Stock Market: భారీ నష్టాలు

image

త్రైమాసిక ఫ‌లితాల్లో కీల‌క సంస్థ‌ల వీక్ ఎర్నింగ్స్‌, FIIల అమ్మ‌కాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ 930 పాయింట్లు న‌ష్ట‌పోయి 80,220 వ‌ద్ద‌, నిఫ్టీ 309 పాయింట్లు న‌ష్ట‌పోయి 24,472 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. నిఫ్టీలో 47 స్టాక్స్ న‌ష్టపోయాయి. BSEలో ICICI, Infy మిన‌హా మిగిలిన 28 స్టాక్స్ రెడ్‌లో ముగిశాయి. నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

Similar News

News October 22, 2024

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి: కేంద్రమంత్రి

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ ఖండించారు. ప్రపంచంలో చమురు కొరత ఏమాత్రం లేదని, కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 డాలర్లుగా ఉంది.

News October 22, 2024

పాసుపోర్టు, వీసా ఉంటేనే ఈ రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ!

image

పంజాబ్‌లోని అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే ఇండియన్ పాసుపోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఈ స్టేషన్ ఇండియా, పాక్ బోర్డర్‌లో ఉండటమే ఇందుకు కారణం. IND-PAK రైలు మార్గంలో భారత్ పరిధిలో ఉండే చివరి స్టేషన్ ఇదే. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇక్కడి నుంచి PAKకు రైళ్లు నడవట్లేదు. అంతకుముందు అటారీ-లాహోర్ మధ్య నడిచేవి. ఈ స్టేషన్‌ను 1862లో ప్రారంభించారు.

News October 22, 2024

హరియాణాలో 16మంది రైతుల అరెస్టు

image

పంట వ్యర్థాలు కాలుస్తున్న 16మంది రైతుల్ని హరియాణా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏటా శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణ స్థాయికి చేరుకుంటోంది. పంజాబ్, హరియాణా రైతులు పంటవ్యర్థాలు కాల్చడం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా పంట వ్యర్థాలను కాలుస్తున్న రైతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెయిలబుల్ అఫెన్స్ కావడంతో వెంటనే బెయిల్ లభించినట్లు వారు తెలిపారు.