News October 22, 2024

బాబు బొడ్డుతాడు కట్ చేసిన యూట్యూబర్.. కేసు నమోదు

image

వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఇర్ఫాన్ అనే వ్యక్తి తన భార్య డెలివరీ జరుగుతుండగా ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లి బాబు బొడ్డుతాడును కట్ చేశాడు. దీన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా వైరలైంది. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర హెల్త్ డిపార్ట్‌మెంట్ సీరియస్ అయ్యింది. సదరు వ్యక్తి, డాక్టర్, ప్రైవేట్ ఆస్పత్రిపై కేసు పెట్టింది.

Similar News

News January 12, 2026

కొనసాగుతున్న రూపాయి పతనం

image

ఈ వారం మార్కెట్‌ను రూపాయి నష్టాలతో ప్రారంభించింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పతనమయ్యి రూ.90.23 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణలు ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. శుక్రవారం 28 పైసలు పతనమయ్యి రూ.90.18 వద్ద ముగియగా ఇవాళ కూడా నష్టాల్లో కొనసాగుతోంది. జియో పాలిటిక్స్, అమెరికా టారిఫ్స్ భయం కూడా దీనికి కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

News January 12, 2026

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. కారణాలివే

image

నేడు స్టాక్ మార్కెట్ సూచీలు ఆరంభం నుంచే భారీ నష్టాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ట్రంప్ సర్కార్ భారత్‌పై భారీగా సుంకాలు విధిస్తుందన్న భయాలు. 2. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి నిధులను వెనక్కి తీసుకోవడం. 3.TCS వంటి బడా కంపెనీల Q3 ఫలితాలపై ఆందోళన. 4. ఇరాన్‌ అల్లర్లు సహా అంతర్జాతీయ ఉద్రిక్తతలు.

News January 12, 2026

‘ఈ-ఫార్ములా’ కేసులో మరిన్ని వివరాలు కోరిన కేంద్రం

image

TG: E-ఫార్ములా కేసులో IAS అధికారి అరవింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని కేంద్రాన్ని GOVT DECలో కోరింది. విదేశీ కంపెనీకి ₹55Cr విడుదల చేయడంలో ఆయన పాత్ర ఉందని నివేదించింది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించాలని కేంద్రం తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. IASపై వచ్చిన అభియోగాలు నిజమో కాదో తేలిన తరువాతే నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రం అందించే సమాచారం సంతృప్తికరంగా ఉంటే అనుమతిస్తుంది.