News October 22, 2024

టీయూ M.ED సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు షెడ్యూట్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని M.ED మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫీజు టైం టేబుల్ విడుదలైంది. పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 28వ తేదీలోపు చెల్లించాలని పరీక్షల నియంత్రణ అధికారి అరుణ తెలిపారు. అపరాధ రుసుముతో వచ్చే నెల 1వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు. కావున విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News November 10, 2025

అకోలా-కాచిగూడ రైలులో ఒకరి హత్య

image

అకోల నుంచి కాచిగూడ వెళ్లే రైలులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి సోమవారం తెలిపారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. ఉమ్మడి గ్రామానికి చెందిన అతిశ రైలులో వాటర్ బాటిల్ అమ్ముకుంటూండగా, అదే గ్రామానికి చెందిన షేక్ జమీర్ వాటర్ బాటిల్ విషయంలో గొడవ పడ్డారు. దీంతో జమీర్ గాజు సీసాతో అతిశపై దాడి చేయగా మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని కరికెల్లి, ధర్మాబాద్ మధ్యలో జరిగింది.

News November 10, 2025

నిజామాబాద్: ప్రజావాణిలో 16 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజమాబాద్ సీపీ సాయి చైతన్య సోమవారం ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో 16 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను అందించవచ్చని సూచించారు.

News November 10, 2025

NZB: అజారుద్దీన్‌ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

image

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని అజారుద్దీన్‌ను తాహెర్ బిన్ హందాన్ కోరారు.