News October 22, 2024

నాయకత్వానికి వయసుతో సంబంధం లేదు: Zepto CEO

image

కంపెనీని విజయవంతంగా నడిపించేందుకు వయసుతో సంబంధం లేదని Zepto CEO ఆదిత్ పాలిచా పేర్కొన్నారు. NDTV వరల్డ్ సమ్మిట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో తన కంటే అధిక వయస్కులను ఇంటర్స్న్‌గా తీసుకున్నానని చెప్పారు. ‘నా ఏజ్ కంటే రెండు రెట్లు ఎక్కువ గల ఉద్యోగులు సైతం నాకు రిపోర్ట్ చేస్తుంటారు. నాయకత్వానికి వయసుతో పట్టింపు లేదు’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News October 22, 2024

రేపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ

image

భార‌త ప్ర‌ధాని మోదీ, చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌ల భేటీ ఖరారైంది. ఐదేళ్ల తర్వాత వీరిద్దరు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. రష్యాలోని కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా బుధవారం ఈ భేటీ జరగనుంది. ఈ విషయాన్ని భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ వెల్లడించారు. తూర్పు లద్దాక్‌లో పెట్రోలింగ్‌పై భారత్, చైనా మధ్య ఒప్పందం కుదిరిన అనంతరం భేటీ జరగనుండడం గమనార్హం.

News October 22, 2024

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి: కేంద్రమంత్రి

image

మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలను కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ ఖండించారు. ప్రపంచంలో చమురు కొరత ఏమాత్రం లేదని, కావాల్సిన దానికంటే ఎక్కువే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ ధర 73 డాలర్లుగా ఉంది.

News October 22, 2024

పాసుపోర్టు, వీసా ఉంటేనే ఈ రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ!

image

పంజాబ్‌లోని అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే ఇండియన్ పాసుపోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఈ స్టేషన్ ఇండియా, పాక్ బోర్డర్‌లో ఉండటమే ఇందుకు కారణం. IND-PAK రైలు మార్గంలో భారత్ పరిధిలో ఉండే చివరి స్టేషన్ ఇదే. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇక్కడి నుంచి PAKకు రైళ్లు నడవట్లేదు. అంతకుముందు అటారీ-లాహోర్ మధ్య నడిచేవి. ఈ స్టేషన్‌ను 1862లో ప్రారంభించారు.