News October 22, 2024

నా భార్యకు నేను నటించడం ఇష్టం ఉండేది కాదు: విక్రమ్

image

తాను సినీ ఫీల్డ్‌లో ఉండటం తన భార్యకు ఇష్టం ఉండేది కాదని తమిళ నటుడు విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా భార్య శైలజ, నేను తొలిసారి మీట్ అయ్యే టైమ్‌కి ఓ షూట్‌లో ప్రమాదం వల్ల తీవ్ర గాయాలతో ఉన్నాను. దాంతో నేను సినిమాలు చేయడం తనకిష్టం ఉండేది కాదు. దానికి తోడు వాళ్ల కుటుంబమంతా కవులు, మేధావులే. కానీ నేను నటనను వదులుకోలేకపోయాను. ఇప్పుడు తను మారిపోయింది. నాకు పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని తెలిపారు.

Similar News

News January 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 3, 2025

TODAY HEADLINES

image

* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’
* తెలంగాణలో సాగు చేసే అందరికీ రైతుభరోసా!
* గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
* ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు
* JAN 3న తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
* ‘తొలి ప్రేమ’ రెమ్యునరేషన్‌తో బుక్స్ కొన్నా: పవన్ కళ్యాణ్
* పెళ్లి చేసుకున్న సింగర్ అర్మాన్ మాలిక్
* ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు గెస్ట్‌గా పవన్ కళ్యాణ్
* మనూ భాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న

News January 3, 2025

ఈసారి చలి వల్ల ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు

image

ఢిల్లీలో మొన్న‌టిదాకా కాలుష్యం వ‌ల్ల మూత‌బ‌డిన స్కూళ్లు, ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వ‌ల్ల మూత‌బ‌డ్డాయి. శీతాకాలం వ‌ల్ల ప‌డిపోతున్న ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు, చ‌లి తీవ్ర‌త కార‌ణంగా NCR ప‌రిధిలోని గౌత‌మ్‌బుద్ధ‌ న‌గ‌ర్‌లో 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. త‌దుప‌రి ఉత్తర్వుల వ‌ర‌కు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. మ‌ధ్య భార‌తంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ Janలో గ‌తం కంటే అధికంగా చ‌లి తీవ్రత ఉంటుంద‌ని IMD తెలిపింది.