News October 22, 2024

మహారాష్ట్రలో విపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాటు?

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి విప‌క్ష మ‌హావికాస్ అఘాడీ కూట‌మి పార్టీలు సీట్ల స‌ర్దుబాటులో ఏకాభిప్రాయానికి వ‌చ్చినట్టు తెలుస్తోంది. ప్ర‌తిపాదిత ఒప్పందం మేర‌కు 288 స్థానాల్లో కాంగ్రెస్ 105-110 స్థానాల్లో, శివ‌సేన UBT 90-95 స్థానాల్లో, NCP SP 75-80 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింప‌నున్నాయి. కాంగ్రెస్-ఉద్ధవ్ మధ్య లుకలుకలు నడుస్తున్నాయన్న వార్తల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం గమనార్హం.

Similar News

News March 19, 2026

ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

image

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.

News March 19, 2026

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గుజరాత్‌లో UCC బిల్

image

గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో UCC(యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సహజీవనంలో ఉండే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెలలోగా ఇలా చేయకపోతే 3M జైలు శిక్ష/₹10K ఫైన్, ఒక్కోసారి రెండూ విధిస్తారు. బలవంతం/మోసపూరితంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మత ఆధారిత చట్టాల స్థానంలో పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, దత్తత విషయంలో పౌరులందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి.

News March 19, 2026

ధురంధర్-2.. ప్రీమియర్స్‌తోనే రూ.75 కోట్లు

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారానే అత్యధిక వసూళ్లు(₹75Cr) సాధించిన భారత చిత్రంగా నిలిచినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. INDలోనే ₹52.50Cr(గ్రాస్) వచ్చినట్లు పేర్కొంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌తోనే హయ్యెస్ట్ కలెక్షన్లు($2.5M) సాధించిన ఇండియన్ సినిమాగానూ నిలిచినట్లు వివరించింది. ఈ క్రమంలో OG(₹25Cr), యానిమల్($1.2M)ను వెనక్కి నెట్టింది.