News October 22, 2024
నా ఒళ్లు, జుట్టు గురించి హేళన చేసేవారు: నిత్య మేనన్

బొద్దుగా ఉండటంపై తనను చాలామంది హేళన చేసేవారని నటి నిత్యా మేనన్ తెలిపారు. ‘ఇప్పుడంటే ఉంగరాల జుట్టు ఫ్యాషన్ కానీ నా తొలి తెలుగు సినిమా చేసినప్పుడు ఏంటీ జుట్టు అని అడిగారు. పొట్టిగా, లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేశారు. నేను ఇలాగే పుట్టాను. మార్చుకోమంటే ఎలా? సమస్య చూసేవారిదే కానీ నాది కాదు. ఆ కామెంట్స్ ఒకప్పుడు చాలా బాధపెట్టేవి. ఇప్పుడు పూర్తి ప్రశాంతంగా ఉంటున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Similar News
News January 19, 2026
పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

AP: పోలవరం పనుల పురోగతిని విదేశీ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ఆ బృందం పర్యటిస్తుంది. కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఇవాళ ప్రాజెక్టులో గ్యాప్ 1, D హిల్, G హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు మెయిన్ డ్యామ్‌లో గ్యాప్ 2, మెటీరియల్ నిల్వలు, 21న స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలిస్తారు.
News January 19, 2026
శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?

తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా TTD ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎంపికైన భక్తులు స్వామిని అతి చేరువ నుంచి దర్శించుకోవడమే కాక ఆయనకు నిర్వహించే పలు సేవల్లోనూ పాల్గొనవచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు ఎల్లుండి చివరి గడువు. లక్కీడిప్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 19, 2026
మునగాకు పొడితో యవ్వనం

ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచడంలో మునగాకుపొడి కీలకపాత్ర పోషిస్తుంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు బరువు, ఒత్తిడిని తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మునగ పొడిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, కురులు మెరుపును సంతరించుకుంటాయి. దీంట్లోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని యవ్వనంగా మార్చుతాయి.


