News October 22, 2024
PHOTO: ఒళ్లు గగుర్పొడిచే ఘటన

ఇరుకైన ప్రదేశం/గుహలో ఇరుక్కుపోతేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది ఇరుకైన బండరాళ్ల సందులో తలకిందులుగా ఉండిపోతే? ఆ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా? తాజాగా ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన యువతికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. రెండు బండరాళ్ల మధ్య పడిన ఫోన్‌ను తీసుకునే ప్రయత్నంలో ఇరుక్కుపోయింది. ఆమె ఫ్రెండ్ వెంటనే రెస్క్యూ బృందాలకు సమాచారం అందించగా 7 గంటల శ్రమ తర్వాత బయటికి తీసుకొచ్చారు.
Similar News
News November 14, 2025
నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.
News November 14, 2025
కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.
News November 14, 2025
న్యూ స్పేస్ ఇండియాలో 47 పోస్టులు

<


