News October 22, 2024

మరోసారి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్న దర్శన్

image

కన్నడ సినీ నటుడు దర్శన్ మరోమారు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు అనారోగ్యంగా ఉందని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. నడుం నొప్పి చాలా తీవ్రంగా ఉందని, సర్జరీ చేస్తే తప్ప కోలుకోలేరని బెయిల్ పిటిషన్లో తెలిపారు. దర్శన్, పవిత్ర గౌడ్ ఇంతకు ముందు దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 14న తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తన అభిమాని రేణుకాస్వామి మర్డర్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.

Similar News

News March 16, 2025

KCRను చర్చకు రమ్మను.. హరీశ్ రావుకు రేవంత్ సవాల్

image

TG: తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు హరీశ్ రావుకు లేవని CM రేవంత్ విమర్శించారు. నాగార్జున సాగర్, SRSP వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు TGకి నీటిని అందిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తి(KCR)ని చర్చకు రమ్మనాలని హరీశ్‌కు సవాల్ చేశారు.

News March 16, 2025

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారు: సీఎం రేవంత్

image

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పును తమపై పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ పాత్ర మరువలేనిదని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయశంకర్ సర్ వంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులని అన్నారు.

News March 16, 2025

అర్ధరాత్రి మహిళా ఎంపీ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు

image

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో MP ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.

error: Content is protected !!