News October 22, 2024
HYD: విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌లో ల్యాండింగ్

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశారు. సీఐఎస్ఎఫ్ భద్రత అధికారులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు విమానంలో సోదాలు చేశాయి. చివరకు ఫేక్ కాల్ అని తేలడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
News November 6, 2025
HYD: సజ్జనార్ సార్.. GUN FIRED

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇవాళ గన్ ఫైర్ చేశారు. నేరస్థుల గుండెల్లో కాదులెండీ తెలంగాణ పోలీస్ అకాడమీలోని బుల్స్‌ఐపై.. అకాడమీలో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు సిటీ పోలీస్ బృందంతో కలిసి హాజరయ్యారు. ఫైరింగ్ రేంజ్లో ఉండటం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని, బుల్స్‌ఐని ఎయిమ్ చేయడం ఎప్పుడూ నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని సీపీ Xలో ట్వీట్ చేశారు.
News November 6, 2025
బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బండి సంజయ్ సభకు అనుమతి రద్దయ్యింది. సా. బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉంది. సభకు అనుమతి ఇచ్చి, ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అడ్డుకొన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సభ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు బోరబండకు చేరుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ లీడర్లు గుర్తుచేశారు.


