News October 22, 2024
పాసుపోర్టు, వీసా ఉంటేనే ఈ రైల్వే స్టేషన్‌లోకి ఎంట్రీ!

పంజాబ్‌లోని అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే ఇండియన్ పాసుపోర్టు, పాకిస్థాన్ వీసా తప్పనిసరిగా ఉండాలి. ఈ స్టేషన్ ఇండియా, పాక్ బోర్డర్‌లో ఉండటమే ఇందుకు కారణం. IND-PAK రైలు మార్గంలో భారత్ పరిధిలో ఉండే చివరి స్టేషన్ ఇదే. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇక్కడి నుంచి PAKకు రైళ్లు నడవట్లేదు. అంతకుముందు అటారీ-లాహోర్ మధ్య నడిచేవి. ఈ స్టేషన్‌ను 1862లో ప్రారంభించారు.
Similar News
News March 16, 2025
KCRను చర్చకు రమ్మను.. హరీశ్ రావుకు రేవంత్ సవాల్

TG: తాటి చెట్టంత పెరిగినా ఆవకాయంత తెలివితేటలు హరీశ్ రావుకు లేవని CM రేవంత్ విమర్శించారు. నాగార్జున సాగర్, SRSP వంటి ప్రాజెక్టులు ఎవరు కట్టారని ప్రశ్నించారు. జూరాల, దేవాదుల, ఎల్లంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టించిందని చెప్పారు. తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులే నేడు TGకి నీటిని అందిస్తున్నాయన్నారు. ప్రాజెక్టులపై పిల్లకాకులు కాకుండా అసలైన వ్యక్తి(KCR)ని చర్చకు రమ్మనాలని హరీశ్‌కు సవాల్ చేశారు.
News March 16, 2025
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారు: సీఎం రేవంత్

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పును తమపై పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ పాత్ర మరువలేనిదని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయశంకర్ సర్ వంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులని అన్నారు.
News March 16, 2025
అర్ధరాత్రి మహిళా ఎంపీ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు

TG: బీజేపీ ఎంపీ డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని ఇంట్లో అర్ధరాత్రి ఆగంతకుడు కలకలం రేపాడు. ముసుగు, గ్లౌజులు ధరించి ఇంట్లోకి చొరబడిన దుండగుడు కిచెన్, హాలు సీసీ కెమెరాలు ఆఫ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దుండగుడు వచ్చిన సమయంలో MP ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు డీకే అరుణ ఫిర్యాదు చేశారు. ఇందులో కుట్రకోణం దాగి ఉందని, భద్రత పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.