News October 22, 2024
విజయనగరంలో TODAY TOP NEWS

>కనుల పండువగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం>చింతపల్లి సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం>ఎస్.కోట మీదుగా నాలుగు లైన్ల రహదారికి నిధులు విడుదల>గుర్ల డయేరియా ఘటనపై ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సమీక్ష>డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పెంపు>డయేరియా మృతులకు నష్టపరిహారం అందించాలని జడ్పీ ఛైర్మన్ డిమాండ్>కార్తీక మాసంలో పంచరామక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Similar News
News January 27, 2026
VZM: రెవెన్యూ, రీ సర్వే సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

రెవెన్యూ, రీ సర్వే సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. తప్పులు లేని రెవెన్యూ రికార్డులు రూపొందించాలన్నారు.
News January 26, 2026
విజయనగరం కలెక్టర్ కాంప్ కార్యాలయంలో ఘనంగా ఎట్ హోమ్ కార్యక్రమం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి కాంప్ కార్యాలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా సంగీత కళాశాల విద్యార్థులు శాస్త్రీయ సంగీతాన్ని మనోహరంగా ఆలపించారు. జిల్లా అధికారులు, సిబ్బంది సందడిగా గడిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత, SP దామోదర్, JC సేధు మాధవన్, కమాండెంట్ మహేష్, అదనపు SP సౌమ్యలత, DRO మురళి పాల్గొన్నారు.
News January 26, 2026
VZM: ‘ఆసుపత్రికి వెళుతూ ఇద్దరూ చనిపోయారు’

బొండపల్లి (M) గొట్లాం సమీపాన బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం <<18950810>>జరిగి ఇద్దరు మృతి చెందిన విషయం<<>> తెలిసిందే. అయితే ఎల్లయ్య పైల్స్‌తో బాధపడుతుండగా.. వరుసకు అల్లుడయ్యే రామునాయుడు బైకుపై VZM ఆసుపత్రికి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రాము నాయుడుకు భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. ఎల్లయ్య భార్యకు దూరంగా ఒంటరిగా ఉన్నారు.


