News October 23, 2024
సిగ్నల్స్ వద్ద ఉండే పిల్లలు నిద్రపోయే కనిపిస్తున్నారా?

హైదరాబాద్‌లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసుకునే కొందరు వారి పిల్లలను నిద్రపుచ్చేందుకు డ్రగ్స్ వాడుతున్నారని సామాజిక వేత్తలు స్వాతి& విజయ్‌లు ఆరోపించారు. ఎందుకు నిద్రపోతున్నారో తెలియకుండానే బాల్యం పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై నోరు విప్పాలని, అంతా కలిసి అలాంటి పిల్లలను కాపాడేందుకు ముందుకు సాగుదామని వీరు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీనిపై కరపత్రాలనూ పంచుతున్నారు.
Similar News
News January 29, 2026
KCR ఫామ్ హౌస్‌కు బయల్దేరిన సిట్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో <<18991166>>నోటీసులు<<>> ఇచ్చేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయల్దేరినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆయనకు నోటీసులు అందించే అవకాశముంది. ఆపై సిట్ నోటీసులపై ప్రకటన చేయనుంది. మరోవైపు రేపు సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.
News January 29, 2026
ఇవాళ KCRకు సిట్ నోటీసులు?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇవాళ సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి, రేపు అక్కడే సిట్ బృందం విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా కేసీఆర్‌ను విచారణకు పిలుస్తారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
News January 29, 2026
లవ్లీ హోం హ్యాక్స్

* కాఫీపొడి, పుదీనా ఆకులు, బేకింగ్ సోడా, నిమ్మతొక్కలు ఒక గిన్నెలో వేసి ఒక మూలన ఉంచితే గది అంతా పరిమళం వ్యాపిస్తుంది.
* కిచెన్‌లో గట్టు, టైల్స్, కిటికీ అద్దాలు జిడ్డుగా ఉంటే పావు కప్పు వెనిగర్, చెంచా బేకింగ్ సోడా, రెండు కప్పుల నీరు కలిపి లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో వేసి జిడ్డు ఉన్నచోట చల్లి శుభ్రం చేస్తే సరిపోతుంది.
* ఉప్పు, నిమ్మరసం కలిపి పింగాణీ పాత్రలను తోమితే మెరుస్తాయి.


