News October 23, 2024

SKLM: ‘సాగునీటి సంఘాల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’

image

శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ నెల 31 నాటికి ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ప్రతీవారం సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మంగళవారం మాట్లాడుతూ.. సాగు నీటి సంఘాల ఎన్నికల అంశంలో కిందిస్థాయి సిబ్బందికి ఆర్డీవోలు తగు శిక్షణ ఇవ్వాలన్నారు.

Similar News

News January 21, 2026

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర.. షెడ్యూల్ ఇదే

image

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం

➱22న (ఆదివారం) జాతర ప్రారంభం

➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు

➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.

చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.

News January 21, 2026

ప్రజలకు అందించే సేవలో జవాబుదారితనం ఉండాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ప్రజలకు అందించే సేవలలో జవాబుదారీతనం ఉండాలని, లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసి జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలో ఉన్న అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలుతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, 1B అడంగల్ జారీలో జాప్యం రాకూడదన్నారు.

News January 21, 2026

SKLM: జైలులో ఉన్న ముద్దాయిల కేసులు త్వరితగతిన పరిష్కరించాలి

image

జైలులో ఉన్న ముద్దాయిల సమస్యలు త్వరితగతన పరిష్కరించాలని జిల్లా కోర్టు న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం మంగళవారం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, గర్భిణీలకు వీలైనంతవరకు న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. దీనివలన జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గుతుందని పేర్కొన్నారు. ASP కె.వి.రమణ, డి.ఆర్.ఓ లావణ్య ఉన్నారు.