News October 23, 2024
అనకాపల్లి: ‘ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సూచించారు. మంగళవారం ఢిల్లీ పార్లమెంట్ భవనంలో రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. రైల్వే వ్యవస్థ కార్యకలాపాల్లో భాగంగా భద్రతను పెంపొందించాలన్నారు.
Similar News
News July 7, 2025
విశాఖ: ’10 వేల మంది మార్గదర్శులను గుర్తించాలి’

పీ-4 విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పని చేయాలని, జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాల అవసరాలను తెలుసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్షరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే మార్గదర్శులను వారం రోజుల్లో గుర్తించాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలో 50 బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించాలన్నారు.
News July 7, 2025
విశాఖ చేరుకున్న మంత్రి పార్థసారధి

ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన నిమ్మితం రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి సోమవారం విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, సమాచార శాఖ అధికారులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి మంత్రి రోడ్డు మార్గాన్న బయలుదేరి నగరంలోకి వెళ్లారు.
News July 7, 2025
విశాఖలో పేకాట స్థావరాలపై దాడులు

మధురవాడ పరిధి కొమ్మాది శివార్లలో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి రూ.43 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. అలాగే భీమిలి సమీపంలో ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రూ.2.51వేలు స్వాధీనం చేసుకున్నారు.