News October 23, 2024

99 శాతం సమస్యల్ని పరిష్కరించాం: ఓలా

image

స్కూటర్ల విషయంలో సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని 99 శాతం మేర పరిష్కరించామని ఓలా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. వినియోగదారుల హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఈ నెల 7న CCPA నుంచి సంస్థకు షోకాజ్ నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఫిర్యాదుల్ని పరిష్కరించే అద్భుతమైన వ్యవస్థ మా సంస్థకు ఉంది. 10,644 ఫిర్యాదులు రాగా వాటిలో 99.1శాతాన్ని పరిష్కరించాం’ అని పేర్కొంది.

Similar News

News October 23, 2024

గంజాయి కాల్చేందుకు స్టేషన్‌కే వెళ్లారు!

image

వారందరూ మైనర్లు, విద్యార్థులు. కేరళలోని త్రిస్సూర్ నుంచి మున్నార్ వరకూ టూర్ వెళ్తున్నారు. దారిలో భోజనం కోసం బస్సు ఆగినప్పుడు ఇద్దరు కుర్రాళ్లు గంజాయి బీడీల్ని తాగాలనుకున్నారు. అగ్గిపెట్టె లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి అడిగారు. తీరా చూస్తే అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

News October 23, 2024

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై నేడు తీర్పు

image

TG: బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని అందిన ఫిర్యాదుపై కేంద్రం విచారించి 2017లో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది.

News October 23, 2024

ఇండియాలోనే అత్యంత నెమ్మదైన రైలు ఏదంటే..

image

హౌరా-అమృత్‌సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్‌కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.